నేటి యువత (Gen Z) కేవలం ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే కాదు, సోషల్ మీడియాలో రీల్స్, ఫోటోలు కోసం కూడా ఆహారాన్ని ఎంపిక చేస్తున్నారు. అందుకే కళ్లకు కట్టేలా కనిపించే, రుచిలో కొత్తదనమున్న వంటకాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
Swiggy, Zomato విడుదల చేసిన 2025-26 నివేదికల ప్రకారం జెన్-జీకి నచ్చిన టాప్ ఫేవరెట్లు ఇవి:
1. కొరియన్ రామెన్ & కె-ఫుడ్ (Korean Ramen):Korean dramaలు, K-pop ప్రభావంతో భారత్‌లో కొరియన్ రామెన్ ఆర్డర్లు సుమారు 50% పెరిగాయి. ముఖ్యంగా స్పైసీ రామెన్, కిమ్చి, కింబాప్ వంటి వంటకాలు యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి.
2. మోమోస్ (Momos):స్ట్రీట్ ఫుడ్ మార్కెట్లో సమోసాకు పోటీగా మోమోస్ దూసుకెళ్తున్నాయి. సాధారణ స్టీమ్ మోమోస్కే కాకుండా కుర్కురే, తందూరి వంటి ఫ్యూషన్ వేరైటీలకు డిమాండ్ పెరిగింది.
3. సుషి (Sushi):ఒకప్పుడు లగ్జరీ రెస్టారెంట్లలో మాత్రమే దొరికే జపనీస్ వంటకం Sushi ఇప్పుడు మెట్రో నగరాల్లో ట్రెండ్‌గా మారింది. సుషి తింటూ తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం యువతలో స్టైల్ స్టేట్మెంట్గా మారింది. అదనంగా, ఇది తేలికగా జీర్ణమయ్యే ఆరోగ్యకరమైన ఎంపికగా కూడా గుర్తింపు పొందింది.
4. పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్ & బర్గర్: సాధారణ ఫ్రైస్‌కు బదులుగా ఇప్పుడు పెరి పెరి మసాలాతో చేసిన స్పైసీ ఫ్రైస్ ప్రాచుర్యం పొందాయి. రుచి కోసం ఆరోగ్యాన్ని కొంత పక్కన పెట్టే ఈ తరం, చీజ్ బర్గర్లను కూడా ఎక్కువగా ఆర్డర్ చేస్తోంది.
5. బోబా టీ (Boba Tea): సాధారణ టీ, కాఫీలకు బదులుగా ఇప్పుడు యువత Bubble tea వైపు మొగ్గు చూపుతోంది. ఇందులో ఉండే టాపియోకా బాల్స్ ప్రత్యేకమైన టెక్స్చర్ అనుభూతిని ఇస్తాయి. గత ఏడాదితో పోలిస్తే దీని కోసం సెర్చ్‌లు 11 రెట్లు పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa