ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాఠశాల గోడను ఢీకొన్న వ్యాన్.. తప్పిన పెను ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 23, 2026, 04:46 PM

అల్లూరి సీతారామారాజు జిల్లా జీకేవీధి మండలకేంద్రంలోని కస్తూర్బా గాంధి పాఠశాలలోకి ఓ వాహనం దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానిక పాఠశాలలో నిర్మాణ పనులు జరుగుతున్నందున ఆ పనులకు సోమవారం ఉదయం ఇసుక తీసుకువచ్చిన వ్యాన్ అదుపుతప్పి గోడ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రహరీ గోడ విరిగి వాహనం బోల్తా పడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa