రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ బ్యాంకు మోసం కేసుకు సంబంధించి ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి చెందిన రూ.3,716.83 కోట్ల విలువైన పాలి హిల్ నివాస ఆస్తిని ఈడీ బుధవారం తాత్కాలికంగా జప్తు చేసింది. 17 అంతస్తులతో 66 మీటర్ల ఎత్తు ఉన్న ఈ విలాసవంతమైన ఇల్లు విలువ రూ.3,716 కోట్లు ఉంటుందని అంచనా. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.అనిల్ గ్రూప్ కంపెనీలు కోట్లాది రూపాయల బ్యాంకు రుణాల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో సంబంధం ఉన్న ఈ కేసులో భాగంగా ఆ ఇంటిని ఈడీ అటాచ్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.గతంలో ముంబైలోని రూ.473.17 కోట్ల విలువైన ఆస్తిని కూడా ఈడీ అటాచ్ చేసింది. ఈ కేసులో ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విలువ రూ.15,700 కోట్లకు చేరింది. ఆర్.కామ్., దాని అనుబంధ సంస్థలు దేశీ, విదేశీ రుణదాతల నుంచి తీసుకున్న మొత్తంలో రూ.40,185 కోట్ల బకాయిలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa