ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యోగి ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా అఖిలేశ్ అడుగులు

national |  Suryaa Desk  | Published : Wed, Feb 25, 2026, 08:20 PM

భారత రాజకీయాల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2027 ప్రారంభంలో జరగనున్నాయి. కానీ, అప్పుడే ఆ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలయింది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ భారీ స్కెచ్ వేశారు. వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా దేశంలోనే అత్యంత విజయవంతమైన రాజకీయ వ్యూహకర్తల సంస్థ 'ఐ-ప్యాక్' తో అఖిలేశ్ ఒప్పందం కుదుర్చుకున్నారు.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ ఇచ్చిన సూచన మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేశారు. ఐ-ప్యాక్ వ్యూహాలతోనే బెంగాల్‌లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే విజయాలు సాధించిన నేపథ్యంలో అదే ఫార్ములాను యూపీలోనూ వర్తింపజేయాలని ఆయన నిర్ణయించారు. పార్టీ ప్రచారాన్ని కేవలం పట్టణాలకే పరిమితం చేయకుండా జిల్లా బూత్ స్థాయి వరకు బలంగా తీసుకువెళ్లే బాధ్యతను ఐ-ప్యాక్‌కు అప్పగించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa