ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్ఎంఏ టైప్-1 అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి లోకేశ్ అండ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 25, 2026, 09:08 PM

ఎస్ఎంఏ టైప్-1 అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. కర్నూలుకు చెందిన బాలిక పునర్విక ఈ వ్యాధితో బాధపడుతోంది. ఆమె చికిత్స కోసం మరో రూ.6 కోట్లు అవసరమని, ఆ మొత్తం అందేలా చూసే బాధ్యత తనదేనని 'ఎక్స్' వేదికగా హామీ ఇచ్చారు.తన కూతురు పునర్విక ఎస్ఎంఏ టైప్-1 వ్యాధితో బాధపడుతోందని, చికిత్స కోసం రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఒక్కటే ఆప్షన్‌గా ఉందని, దాని కోసం తాము అన్ని రకాలుగా ప్రయత్నించి ప్రజల నుంచి, దాతల నుంచి రూ.10 కోట్ల వరకు సేకరించామని, మరో రూ.6 కోట్లు అవసరమని పేర్కొంటూ పునర్విక తండ్రి మంత్రి నారా లోకేశ్‌కు 'ఎక్స్' ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిపై నారా లోకేశ్ స్పందించారు.ఎస్ఎంఐ టైప్-1 అనేది అరుదైన వ్యాధి అని, దీనితో కండరాలు బలహీనపడతాయని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఇలాంటి స్థితిలోనూ పునర్విక పోరాడుతున్న తీరు అభినందనీయమని పేర్కొన్నారు. ఆమె నిజంగా ధైర్యవంతురాలని ప్రశంసించారు. అసాధారణ ధైర్యంతో వ్యాధితో పోరాటం చేస్తోందని అన్నారు.ఆమె ఇంజెక్షన్ కోసం రూ.16 కోట్లు అవసరమని, దాతల నుంచి రూ.10 కోట్లు సమకూరడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. పునర్విక ఇంజెక్షన్ కోసం సహకరించిన ప్రతి ఒక్కరికీ తాను సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. ఆమె చికిత్స కోసం మిగిలిన రూ.6 కోట్లు అందేలా చూసే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. సహాయం చేయాలంటూ తన కార్యాలయ 'ఎక్స్' ఖాతాకు అటాచ్ చేశారు. పునర్వికకు సహాయం చేయడానికి మరింతమంది ముందుకు రావాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa