ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మటన్ తింటే వెంటనే చేయకూడని 7 తప్పులు… ఆరోగ్యానికి శాపమే!

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Feb 25, 2026, 10:40 PM

రుచికరమైన మటన్ వంటకాలను ఇష్టపడని వారు చాలా తక్కువే. ప్రోటీన్, ఐరన్‌లతో సమృద్ధిగా ఉండే మటన్ ఆరోగ్యానికి మంచిది, కానీ తిన్న తర్వాత కొన్ని అలవాట్లు చేయడం జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి.అజీర్ణం, కడుపులో మంట వంటి సమస్యలు రావకుండా ఉండేందుకు, మటన్ తిన్న తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటించాలి:
*మటన్ తిన్న వెంటనే చేయకూడనవి:
1.పాలు మరియు పాల ఉత్పత్తులు – మటన్ తిన్న వెంటనే పాలు తాగడం లేదా పాల పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు. ఇవి ప్రోటీన్, కొవ్వు ఎక్కువగా కలిగివుండడంతో శరీరం వాటిని జీర్ణం చేయడానికి ఎక్కువ శ్రమ పడుతుంది. దీనివల్ల కడుపులో అసౌకర్యం, ఆవిర్గా గ్యాస్ సమస్యలు కలగవచ్చు.
2.చల్లని నీరు లేదా సోడా – మాంసం తిన్న వెంటనే చల్లటి పానీయాలు తీసుకోవడం జీర్ణరసాల పనితీరును మందగిస్తుంది. అలాగే, ఆహారంలోని కొవ్వు గడ్డకట్టే అవకాశం ఉంది. బదులుగా, గోరువెచ్చని నీరు తాగడం ద్వారా జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది.
3.వెంటనే పడుకోవడం – భోజనం చేసిన వెంటనే పడుకోవడం అజీర్ణం, ఎసిడిటీ సమస్యలకు దారితీస్తుంది. మటన్ తిన్న తర్వాత కనీసం 20-30 నిమిషాలు నెమ్మదిగా నడవడం జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.
4.సలాడ్ తీసుకోవడం – మాంసంతో పాటు సలాడ్ తీసుకోవడం వల్ల అందులోని ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa