AP: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త అందించింది. పబ్లిక్ పరీక్షల సమయంలో హాల్‌టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షల సందర్భంగా విద్యార్థులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండగా, టెన్త్ విద్యార్థులకు కూడా కొనసాగించే అవకాశం ఉంది. కాగా, గత సంవత్సరం కూడా ఉచిత ప్రయాణాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa