భారత వ్యూహాత్మక ప్రయోజనాలకు అత్యంత కీలకమైన ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవు ప్రాజెక్టు భవిష్యత్తుపై సందేహాలు మొదలయ్యాయి. కేంద్ర బడ్జెట్ 2026-27లో ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపును సున్నాకు తగ్గించడంపై ఇరాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హిందూ మహాసముద్రాన్ని మధ్య ఆసియాతో అనుసంధానించే ఈ ‘బంగారు ముఖద్వారం’ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయం నిరాశపరిచిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వ్యాఖ్యానించారు.గత బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టు కోసం మొదట రూ.100 కోట్లు కేటాయించి, ఆ తర్వాత సవరించిన అంచనాల్లో దాన్ని రూ.400 కోట్లకు పెంచిన కేంద్రం, ఈసారి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దౌత్య వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే, ఈ ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. తాము నిధులు నిలిపివేయలేదని, 10 ఏళ్ల ఒప్పందంలో భాగంగా చెల్లించాల్సిన 120 మిలియన్ డాలర్ల మొత్తాన్ని ఇప్పటికే పూర్తిగా చెల్లించేశామని స్పష్టం చేసింది. అందువల్ల ప్రస్తుతానికి కొత్తగా నిధులు కేటాయించాల్సిన అవసరం లేదని వివరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa