కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో ఓ మఠాధిపతి దారుణానికి ఒడిగట్టాడు. ఏడేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడిని షహాపుర్ తాలూకాలోని మహల్ రోజా మఠానికి చెందిన మల్లికార్జున ముత్యగా గుర్తించారు.మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన ఓ కుటుంబం తమ బంధువు పుట్టినరోజు వేడుకల కోసం ఈ మఠానికి వచ్చింది. ఈ క్రమంలో పీఠాధిపతి అయిన మల్లికార్జున ముత్య ఆ కుటుంబంలోని ఏడేళ్ల చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకుని అసభ్యంగా ముద్దులు పెట్టాడు. అయితే, ఈ దారుణాన్ని అడ్డుకోవాల్సిన తల్లిదండ్రులు.. బాబా ఆశీస్సులు ఇస్తున్నాడని భావించి, ఆ దృశ్యాలను తమ ఫోన్లో వీడియో తీశారు. సోషల్ మీడియాలో లైకుల కోసం ఆ వీడియోను అప్లోడ్ చేయడంతో ఈ అకృత్యం వెలుగులోకి వచ్చింది.ఈ వీడియోపై కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా స్పందించి విచారణకు ఆదేశించింది. పోలీసుల విచారణ అనంతరం గోగి పోలీస్ స్టేషన్లో నిందితుడైన మల్లికార్జున ముత్యపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa