2022-23ను బేస్ ఇయర్‌గా తీసుకుని రూపొందిస్తున్న కొత్త జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) సిరీస్‌లో పలు ఆధునిక డేటా వనరులను చేర్చనున్నారు. ఈ-వాహన్ పోర్టల్ గణాంకాలు, వస్తు–సేవల పన్ను (జీఎస్టీ) వివరాలతో పాటు వంటవాళ్లు, డ్రైవర్లు, పనిమనుషులు అందించే గృహ సేవలకు సంబంధించిన అంచనాలను కూడా ఇందులో పరిగణనలోకి తీసుకోనున్నారు.గణాంకాలు, పథకాల అమలు శాఖ (ఎంవోఎస్పీఐ) వెల్లడించిన వివరాల ప్రకారం, ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకునే నిర్మాణాత్మక మార్పులను ప్రతిబింబించేందుకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి బేస్ ఇయర్ మార్చడం ఆనవాయితీ. అయితే కోవిడ్ ప్రభావం, జీఎస్టీ అమలు వంటి పరిణామాల కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడింది. ప్రస్తుతం 2011-12గా ఉన్న బేస్ ఇయర్‌ను 2022-23కి సవరించనున్నారు.కొత్త సిరీస్‌లో కార్మిక శక్తి సర్వే ఫలితాలు, కంపెనీల చట్టం కింద నమోదు కాని సంస్థలపై నిర్వహించిన అధ్యయనాల వివరాలు కూడా చేరనున్నాయి. రహదారి రవాణా సేవలపై ప్రైవేట్ వినియోగ వ్యయాలను అంచనా వేయడానికి ఈ-వాహన్ పోర్టల్ డేటాను వినియోగిస్తారు. రాష్ట్రాలవారీగా ప్రైవేట్ కంపెనీల ఆర్థిక వాటాను లెక్కించేందుకు జీఎస్టీ గణాంకాలు ఆధారంగా తీసుకోనున్నారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మూడో త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్ 2025) జీడీపీ గణాంకాలను ఈ కొత్త సిరీస్ ప్రాతిపదికన శుక్రవారం విడుదల చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa