ఏపీ రాజధాని అమరావతిలో అగ్నిప్రమాదం జరిగింది. వెలగపూడి సీడ్ యాక్సిస్ రెడ్డులోని ఎన్9 జంక్షన్ వద్ద మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎల్అండ్‌టీ సంస్థకు చెందిన పైపులు కాలిపోయాయి. భారీ శబ్ధంతో పైపులు తగలబడిపోయాయి. పెద్దఎత్తున మంటలు, దట్టమైన పొగ విస్తరించటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ పరిసర ప్రాంతమంతా నల్లని పొగ కమ్మేసింది. దీంతో భయపడిపోయిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను నియంత్రించే పనిలో ఉన్నారు. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa