ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై 4 లక్షలు కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో 24 గంటలూ దుకాణాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2026, 01:43 PM

రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో దుకాణాలు, వాణిజ్య సంస్థలను 24 గంటలూ నిర్వహించుకునేందుకు రాష్ట్ర కార్మిక శాఖ అనుమతిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 4 లక్షలు అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది.షాపులు, వాణిజ్య సంస్థల చట్టం-1988లోని కొన్ని నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, వాటిలో పనిచేసే సిబ్బంది చేత మాత్రం వారానికి గరిష్ఠంగా 48 గంటలు మాత్రమే పని చేయించాలని, ఆ సమయం మించితే తప్పనిసరిగా ఓవర్ టైం జీతం చెల్లించాలని ఆదేశించింది.అలానే  20 మంది లేదా అంతకంటే ఎక్కువ సిబ్బంది ఉన్న సంస్థలు లైఫ్‌టైమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందేందుకు కూడా కార్మిక శాఖ అనుమతించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు మరింత పెరిగే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa