ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో అర్హులంరికి,,,గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇంటి పట్టాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2026, 05:04 PM

రాష్ట్రంలోని పేదలకు వచ్చే రెండేళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిలో నిర్వహించిన కలెక్టర్లు సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల చొప్పున స్థలం ఇస్తామన్నారు. జిల్లాల్లో ప్రభుత్వ భూములు ఉంటే వాటిలో ఇళ్లు స్థలాలు ఇవ్వాలని.. ఒకవేళ ప్రభుత్వ భూమి లేకపోతే ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి ఇస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో కొన్ని కాలనీలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు.. ఆయా కాలనీల్లో ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు కట్టుకున్నవారిని వదిలేసి.. అక్కడ స్థలం వద్దుకునేవారి స్థలాలు రద్దు చేయాలని సూచించారు. అక్కడ కావాలంటే 3 సెంట్లు ఇవ్వాలని.. ఒకవేళ వద్దనే వారికి మరో చోట ఇస్తామన్నారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.


2015 నుంచి 2024 మే వరకు మొత్తం 18 లక్షల ఇళ్లకు 7.27 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 లక్షల ఇళ్లు పూర్తి చేశారని.. టిడ్కో ఇళ్లు కూడా కలిపి 2.50 లక్షలఇళ్ల గృహప్రవేశాలు చేయబోతున్నామన్నారు. ఇవన్నీ కలిపితే మొత్తం 5.50 లక్షల వరకు ఇళ్లు పూర్తవుతాయన్నారు. మరో 5.27 లక్షల ఇళ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయన్నారు. కేంద్రం హౌసింగ్‌కు సంబంధించిన కార్యక్రమాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ వరకు పొడిగించిందన్నారు. కాబట్టి ఆలోగా ఇళ్లు పూర్తి చేయాలని సూచించారు.. ఒకవేళ పూర్తి చేయలేకపోతే కేంద్రం నుంచి నిధులు కూడా రావన్నారు. జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తూ ఇళ్లు పూర్తి చేసేలా చొర తీసుకోవాలన్నారు.


రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే దిశగా ఆలోచన చేయాలన్నారు చంద్రబాబు. అధికారులు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. రాష్ట్రంలోని బ్లాక్‌స్పాట్‌లను వచ్చే మూడు నెలల్లోగా సరిదిద్దాలని ఎస్పీలు, కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు అవసరమైన నిధులు వెంటనే ఇవ్వాలని ఆర్థిక శాఖాధికారులకు సూచించారు. ప్రమాదాల నియంత్రణ కోసం ప్రతి జిల్లా ఎస్పీకి రూ.కోటి ఇస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa