Yamaha హైబ్రిడ్ బైక్: కాలంతో బైక్‌ల రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు కేవలం పెట్రోల్ ఇంజన్‌తో నడిచే టూ-వీలర్స్ మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వెహికల్స్ కూడా మార్కెట్లోకి వచ్చాయి.కొన్ని కంపెనీలు ముందస్తుగా ఆలోచించి హైబ్రిడ్ వెహికల్స్‌ను పరిచయం చేస్తున్నాయి. హైబ్రిడ్ బైక్‌లలో రెండు ఇంజన్లు ఉంటాయి: ఒకటి పెట్రోల్ ఇంజన్, మరొకటి ఎలక్ట్రిక్ మోటార్. Yamaha ఈ విధమైన హైబ్రిడ్ బైక్‌ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనుంది. కంపెనీ నమ్మకం ప్రకారం, డిజైన్ మరియు హైబ్రిడ్ ఇంజన్ కలయిక యూత్‌లో చాలా క్రేజ్ సృష్టిస్తుంది.Yamaha MT-09 PHEV ఈ కొత్త హైబ్రిడ్ బైక్. దీని ఇంజన్ పెద్దదిగా కనిపిస్తుంది, ఎందుకంటే ఇందులో 890 సిసి సామర్థ్యం కలిగిన 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఒక ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది. బైక్ 50 కిమీ/గంట వేగం దాటిన తర్వాత ఎలక్ట్రిక్ మోటార్ ఆటోమేటిక్‌గా యాక్టివ్ అవుతుంది. సైలెంట్ మోడ్‌లో నడుస్తున్నప్పుడు కార్బన్ ఉద్గారాలు చాలా తక్కువగా ఉంటాయి. బ్యాటరీను చార్జ్ చేయడానికి వెనుక భాగంలో ప్రత్యేక పోర్ట్ ఏర్పాటు చేశారు, కాబట్టి ఇంట్లో లేదా చార్జింగ్ స్టేషన్లో సులభంగా రీచార్జ్ చేయవచ్చు.ఇంజన్ పనితీరం మాత్రమే కాకుండా, ఈ బైక్‌లోని టెక్నాలజీ కూడా ఆకర్షణీయంగా ఉంది. TFT డిస్ప్లే ద్వారా స్పీడ్, మోడ్, బ్యాటరీ స్థితి వంటి అన్ని వివరాలు చూడవచ్చు.Yamaha బైక్‌లను సాధారణంగా యువత ఎక్కువగా ఇష్టపడుతుంది, కాబట్టి MT-09 PHEVను ఆకట్టుకునే రంగులలో రిలీజ్ చేయనున్నారు. ప్రారంభ ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మార్కెట్లోకి వచ్చిన తర్వాత, ఇది డుకాటి మాన్స్టర్, ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ వంటి హై-ఎండింగ్ బైక్‌లతో పోటీ చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa