TVS ఆటోమొబైల్ మార్కెట్లో ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో TVS ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే అనేక రకాల EVలు మార్కెట్లోకి వచ్చాయి, వాటిలో Orbiter V1, Orbiter V2 స్కూటర్లు వినియోగదారులలో ప్రత్యేకంగా చర్చలో ఉన్నాయి. ప్రారంభంలో ఒకే వేరియంట్‌గా వచ్చిన ఈ రెండు మోడళ్ల మధ్య ఫీచర్లు, మైలేజ్, ధరలలో స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి.
-Orbiter V1 ఎలక్ట్రిక్ స్కూటర్ 1.8 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే 68 కిలోమీటర్ల వరకు రైడ్ చేయవచ్చు, మొత్తం ఛార్జింగ్ కోసం సుమారు 2 గంటలు పడతాయి. 2.8 kW గరిష్ట పవర్ సామర్థ్యం కలిగిన BLDC మోటార్ ద్వారా స్కూటర్ నడుస్తుంది. Orbiter V1లో 14 అంగుళాల ఫ్రంట్ వీల్, 12 అంగుళాల రియర్ వీల్, కలర్ LCD డిస్ప్లే, క్రూయిస్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.84,500.Orbiter V2 మోడల్లో 3.1 kWh బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 158 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. జీరో నుండి 80% వరకు ఛార్జింగ్ అయ్యేందుకు 4 గంటల 10 నిమిషాలు పడతాయి.
-Orbiter V2లో V1లో ఉన్న ఫీచర్లన్నీ ఉన్నాయి, అలాగే టాప్ స్పీడ్ 68 కిలోమీటర్లు/గంట. ఈ మోడల్ ఆరు కలర్స్‌లో లభిస్తుంది మరియు ప్రారంభ ధర రూ.99,000.ఈ రెండు మోడళ్లూ రోజువారీ వినియోగానికి, షాపింగ్ లేదా ఆఫీస్ రైడ్‌కు అనుకూలంగా రూపొందించబడ్డాయి. ముందుభాగంలో ఎక్కువ స్పేస్, స్టైలిష్ హెడ్లాంప్ డిజైన్ వినియోగదారులను ఆకర్షిస్తాయి. Orbiter V1, V2 మోడళ్ల తేడాలు వాటి బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, ఛార్జింగ్ సమయం మరియు ప్రారంభ ధరల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa