పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతూ పరిస్థితి తీవ్రంగా మారుతోంది. Iran-United States మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే హార్మూజ్ జలసంధి మూసివేయడం ప్రపంచ దేశాలకు పెద్ద షాక్‌గా మారింది.దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా దెబ్బతిని, అనేక దేశాలు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కొన్ని దేశాలు కఠిన చర్యలు తీసుకుంటుండగా, మరికొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రపంచంలోనే అత్యల్ప ధరకు పెట్రోల్ లభించే దేశంగా Libya నిలిచింది. అక్కడ లీటర్ పెట్రోల్ ధర సుమారు రూ.2 మాత్రమే ఉండటం విశేషం.గత దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. వనరుల కొరత, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, అలాగే Russia-Ukraine War వంటి సంఘటనలు దీనికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ప్రస్తుతం భారతదేశంలో చాలా ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100కు పైగా ఉండటం గమనార్హం.అయితే కొన్ని చమురు సంపన్న దేశాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ‘గ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్’ నివేదిక ప్రకారం, Libya, Iran దేశాల్లో ప్రపంచంలోనే తక్కువ ధరకు ఇంధనం లభిస్తోంది. ఈ దేశాల్లో లీటర్ ధర రూ.2 నుంచి రూ.3 మధ్యే ఉంది.ప్రపంచంలోనే అత్యల్ప ధరకు పెట్రోల్ అందిస్తున్న దేశంగా లిబియా ముందంజలో ఉంది. అక్కడ లీటర్‌కు కేవలం $0.024 (సుమారు రూ.2.15)కే విక్రయిస్తున్నారు. ప్రజలకు ఆర్థిక ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం భారీ సబ్సిడీలు అందిస్తోంది.ఇక రెండో స్థానంలో ఉన్న ఇరాన్లో కూడా ధరలు చాలా తక్కువగా ఉంటాయి. అక్కడ లీటర్ పెట్రోల్ సుమారు $0.029 (రూ.2.5 ప్రాంతంలో)కే లభిస్తుంది. పాశ్చాత్య ఆంక్షలు ఉన్నప్పటికీ, స్థానికులకు తక్కువ ధరలో ఇంధనం అందించేందుకు ప్రభుత్వం సబ్సిడీ విధానాన్ని కొనసాగిస్తోంది.మూడో స్థానంలో ఉన్న Venezuela ఒకప్పుడు అత్యల్ప ధరల దేశంగా నిలిచింది. ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ సుమారు రూ.3కి లభిస్తున్నప్పటికీ, సబ్సిడీ కింద నెలకు 120 లీటర్లకే పరిమితం చేశారు.ఇవే కాకుండా Kuwait, Angola వంటి దేశాల్లో కూడా తక్కువ ధరలకు పెట్రోల్ లభిస్తోంది. ఉదాహరణకు అంగోలాలో లీటర్ ధర సుమారు రూ.27 వరకు ఉంటుంది.మొత్తంగా చూస్తే, చమురు నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాలు తమ ప్రజలకు సబ్సిడీల ద్వారా తక్కువ ధరలో ఇంధనం అందిస్తుండగా, ఇతర దేశాలు మాత్రం అధిక ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa