ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత అమెరికా అధ్యక్షుడు మరోసారి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈసారి ఆ హెచ్చరికలు నేరుగా ఇరాన్‌కు కాకుండా, ఆ దేశానికి ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై కేంద్రీకృతమయ్యాయి.ఇకపై ఇరాన్‌కు ఆయుధాలు అందించే దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధిస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఇరాన్‌కు సాయంగా ఆయుధాలు పంపుతూ అమెరికాకు వస్తువులు ఎగుమతి చేసే దేశాలపై 50 శాతం వరకు సుంకాలు విధిస్తామని తన ట్రూత్ సోషల్ వేదికగా హెచ్చరించారు.ఇటీవల ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు తాత్కాలికంగా తగ్గినట్లైంది. ఈ ఒప్పందం తర్వాత ఇరాన్‌పై దాడులను రెండు వారాల పాటు నిలిపివేస్తామని ట్రంప్ ప్రకటించినట్లు సమాచారం.హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ అంగీకరించడంతో పాటు 10 ప్రతిపాదనలను అమెరికా ముందు ఉంచినట్లు తెలుస్తోంది. వీటిపై సానుకూల స్పందన వచ్చిన నేపథ్యంలో, హర్మూజ్ ప్రాంతంలో రాకపోకలకు రెండు వారాల పాటు అనుమతి ఇవ్వనున్నట్లు ఇరాన్ భద్రతా మండలికి తెలియజేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa