దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ ఉద్యోగులకు తీపి కబుర్లు ప్రకటించింది. 2026 ఏప్రిల్ 1 నుంచి అన్ని గ్రేడ్లలోని ఉద్యోగులకు వార్షిక వేతన పెంపు (Appraisal) అమలు కాబోతోంది అని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.ఈ పెంపు కంపెనీలోని అన్ని స్థాయి ఉద్యోగులకు వర్తించనుంది. అయితే, ఎంత శాతం జీతం పెరుగుతుందనే ఖచ్చిత వివరాలు ఇప్పటివరకు కంపెనీ ప్రకటించలేదు.
*భవిష్యత్తు సిద్ధత : టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ సుదీప్ కున్హుమల్ మాట్లాడుతూ, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి తమ ఉద్యోగులను సిధ్ధం చేయడానికి ఈ జీతాల పెంపు చేపట్టారని తెలిపారు. ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై కంపెనీ దృష్టి సారిస్తోంది.గత త్రైమాసికంలో (Q4 FY26) కంపెనీలో కొత్తగా 2,300 మంది ఉద్యోగులు చేరారు. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,84,519కి చేరింది.
*ఫైనాన్షియల్ రిపోర్ట్ : మార్చిలో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ లాభం 12.2% పెరిగి రూ. 13,718 కోట్లుకు చేరింది. కంపెనీ ఆదాయం కూడా 9.6% పెరిగి రూ. 70,698 కోట్లుగా నమోదైంది.గత ఏడాదిలో మధ్యస్థాయి, దిగువ స్థాయి ఉద్యోగులకు 4.5% నుంచి 7% వరకు వేతన పెంపు, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు 10% వరకు పెంపు అందించబడింది. ఈ తాజా నిర్ణయం లక్షలాది TCS ఉద్యోగులకు లాభాన్ని అందించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa