ఐపీఎల్‌లో Ryan Rickelton అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చరిత్ర సృష్టించాడు. Sunrisers Hyderabad బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ ముంబై ఇండియన్స్ తరఫున విధ్వంసకర సెంచరీ నమోదు చేశాడు. కేవలం 44 బంతుల్లోనే శతకం పూర్తి చేసి ప్రత్యర్థి జట్టుకు షాక్ ఇచ్చాడు.ఈ మ్యాచ్‌లో అతని దూకుడు ఇన్నింగ్స్ కారణంగా ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లు పూర్తిగా విఫలమై పరుగుల ప్రవాహాన్ని ఆపలేకపోయారు.ఇన్నింగ్స్‌ను ముంబై ఇండియన్స్ ఓపెనర్లు Mumbai Indians విల్ జాక్స్ మరియు రికల్టన్ దూకుడుగా ప్రారంభించారు. తొలి వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. విల్ జాక్స్ 22 బంతుల్లో 46 పరుగులు చేసి నితీష్ కుమార్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరాడు. హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్ కొంతమేర నిలకడగా ఆడినా జట్టుకు పెద్ద స్కోర్ దిశగా దారి చూపింది రికల్టన్ ఇన్నింగ్స్. తిలక్ వర్మ కూడా తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు.అయితే మ్యాచ్ మొత్తం తన బ్యాట్‌తో రికార్డుల వర్షం కురిపించాడు రికల్టన్. 55 బంతుల్లో 123 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 10 ఫోర్లు ఉన్నాయి. ఈ సెంచరీతో అతను 45 బంతుల్లో శతకం చేసిన సనత్ జయసూర్య రికార్డును అధిగమించాడు.మ్యాచ్ అనంతరం ఈ ఘనతను కుటుంబ సభ్యుల సమక్షంలో సాధించడం మరింత ప్రత్యేకంగా మారింది. వాంఖడే స్టేడియంలో ఉన్న అతని తల్లిదండ్రులు, భాగస్వామి ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. సెంచరీ పూర్తి చేసిన వెంటనే రికల్టన్ వారి వైపు చూస్తూ ఆనందాన్ని పంచుకోవడం మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa