పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని 10వ వార్డు ఏబీఎం కాంపౌండ్లో శుక్రవారం 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి గొట్టిపాటి రవికుమార్, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ నగదును అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల లబ్ధి చేరేలా చర్యలు కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa