ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమర్షియల్ LPG ధరల పెంపు అన్యాయం: కోప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Fri, May 01, 2026, 11:04 PM

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర స్థాయిలో స్పందించారు.ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ శుక్రవారం ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఒక్కసారిగా రూ.993 వరకు పెంచడం ద్వారా సామాన్యులపై భారాన్ని మోపారని ఆయన మండిపడ్డారు. ఇది 30–35 శాతం పెంపు కావడం “దుర్మార్గమైన నిర్ణయం” అని వ్యాఖ్యానించారు.ఈ ధరల పెంపు హోటళ్లు, రెస్టారెంట్లు, అలాగే వీధి వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. కేంద్ర నిర్ణయం కారణంగా సామాన్య ప్రజల జీవన వ్యయం గణనీయంగా పెరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ విధంగా భారం మోపడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. “అమృత్ కాల్” అని గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు.చివరగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa