మే నెల మొదటి రోజునే బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు పసిడి మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో బులియన్ మార్కెట్‌లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి.పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా డాలర్ విలువ బలపడటంతో, పెట్టుబడిదారులు డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగా బంగారం డిమాండ్ తగ్గి ధరలు క్రమంగా పడిపోతున్నాయి. మే 1 సాయంత్రానికి పసిడి రేట్లు గణనీయంగా తగ్గినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.దేశవ్యాప్తంగా నేటి బంగారం ధరలను పరిశీలిస్తే, 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.235 తగ్గి రూ.15,038 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల గ్రాము ధర రూ.215 తగ్గి రూ.13,785 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.176 తగ్గి రూ.11,279 వద్ద ఉంది. 100 గ్రాముల స్థాయిలో చూస్తే 24 క్యారెట్ల బంగారం రూ.23,500 తగ్గి రూ.15,03,800 వద్ద ట్రేడ్ అవుతోంది.22 క్యారెట్ల 100 గ్రాముల బంగారం ధర రూ.21,500 తగ్గి రూ.13,78,500 వద్ద కొనసాగుతుండగా, 18 క్యారెట్ల ధర రూ.17,600 తగ్గి రూ.11,27,900 వద్ద నమోదైంది.హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,350 తగ్గి రూ.1,50,380 వద్ద ఉంది. 22 క్యారెట్ల ధర రూ.2,150 తగ్గి రూ.1,37,850గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.1,760 తగ్గి రూ.1,12,790 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే ధరలు విజయవాడలో కూడా కొనసాగుతున్నాయి.చెన్నైలో మాత్రం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,860 వద్ద, 22 క్యారెట్ల ధర రూ.1,39,200 వద్ద, 18 క్యారెట్ల ధర రూ.1,16,100 వద్ద నమోదైంది.ముంబై, బెంగళూరు, కోల్‌కతా, విశాఖపట్నం వంటి నగరాల్లో కూడా దాదాపు ఇదే స్థాయిలో ధరలు తగ్గాయి. ఢిల్లీ, అహ్మదాబాద్ నగరాల్లో స్వల్ప వ్యత్యాసాలతో బంగారం ధరలు కొనసాగుతున్నాయి.మొత్తానికి అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో పసిడి మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో పరిస్థితులపై ఆధారపడి ధరలు మరింత మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa