ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కారు ప్రమాదంలో ఉత్తరాఖండ్ మంత్రి కుమారుడు మృతి

national |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2019, 11:59 AM

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలోని ఫరీద్‌పూర్ సమీపంలో బుధవారం (జూన్ 26)తెల్లవారుజామున 3 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉత్తరాఖండ్ మంత్రి అరవిందప పాండ్య కుమారుడు అంకుర్ పాండ్య మృతి చెందాడు.అంకుర్ పాండ్య ప్రయాణిస్తున్న కారు ఫరీద్పూర్ సమీపంలోని 24 నంబరు జాతీయ రహదారిపై ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో అంకుర్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా మృతి చెందారు. ఓ వివాహానికి హాజరయ్యేందుకు అంకుర్ గోరఖ్‌పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa