ప్రతిపక్ష నేతపై కక్షసాధింపులో భాగంగానే కూల్చివేతలు చేపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ ప్రజావేదికను అర్ధరాత్రి కూల్చాల్సిన అవసరమేంటి? అని ప్రశ్నించారు. 2, 3 రోజులు సమయం తీసుకొని కూల్చేయొచ్చు కదా అని పేర్కొన్నారు. విజయవాడలో ఉన్న అక్రమ కట్టడాల సంగతేంటో జగన్ చెప్పాలని, ఇదేనా రాజన్న రాజ్యం అంటే? అని ఎద్దేవా చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa