విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం, ఉపమాకలో టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 29 నుండి అక్టోబరు 8వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబరు 29న ఉదయం 9.52 గంటలకు తిరువీధిలో బ్రహ్మోత్సవ కావడి ఊరేగింపుతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. ఆ తరువాత చిన్నపల్లకీ ఉత్సవం, అశ్వ వాహనసేవ నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
30-09-2019 పెద్ద పల్లకీ ఉత్సవం రాజధిరాజ,
01-10-2019 హనుమంత వాహనం ఇత్తడి సప్పరం
02-10-2019 శేషతల్ప వాహనం హంస వాహనం
03-10-2019 రాజధిరాజ పెద్ద పల్లకీ
04-10-2019 పెద్దపల్లకీ ఉత్సవం శేషతల్ప వాహనం
05-10-2019 వసంతోత్సవం – ఇత్తడి గరుడవాహనం
06-10-2019 పుణ్యకోటి – రథోత్సవం
07-10-2019 గజవాహనం – మృగవేట
08-10-2019 పల్లకీ (వినోదోత్సవం) విజయదశమి(పుణ్యకోటి వాహనం)
సెప్టెంబరు 29 నుండి అక్టోబరు 8వ తేదీ వరకు శ్రీ చక్ర పెరుమాళ్‌ను చిన్న పల్లకీపై తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ప్రతిరోజూ టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హరికథా పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa