దివంగత టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో హాజరై సంతకం చేశారు. అసెంబ్లీ ఫర్నీచర్ ను దాచి పెట్టిన కేసులో శివరాంపై సెక్షన్ 409-411 ల కింద కేసు నమోదైంది. ఈ కేసులోనే శివరాంను పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖాలు చేయడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇప్పుడు కోర్టులో శివరాం కోర్టు బెయిల్ పత్రాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో ప్రతి శుక్రవారం తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa