ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మట్టి దీపాలతో ప్రపంచ రికార్డు

national |  Suryaa Desk  | Published : Sun, Oct 27, 2019, 10:57 PM

దేశ వ్యాప్తంగా దీపావళి పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా, కన్నుల పండువలా జరుగుతున్నాయి. దీపావళి వేడుకల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌ సర్కార్ రెండేళ్ల క్రితం 'దీపోత్సవం' పేరుతో దీపాలను వెలిగించే కార్యక్రమం మొదలుపెట్టగా... ప్రతి ఏటా ఈ దీపాల సంఖ్యను పెంచుతూ వస్తున్నారు. కాగా ఏడాది దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా ఏకంగా 5.51 లక్షల మట్టి దీపాలను వెలిగించి యూపీ సర్కార్ ప్రపంచ రికార్డును సృష్టించింది. అయోధ్యలోని సరయు నది ఒడ్డున ఈ దిపోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుక ప్రపంచంలోనే అతి పెద్ద నూనె దీపాల ప్రదర్శనగా దీపోత్సవం-2019 గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కింది. ఈ దీపోత్సవానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా రూ.133 కోట్లు ఖర్చుపెట్టింది. ఈ కార్యక్రమంలో 2500 మంది కళాకారులు రామాయణంలోని వివిధ ఘట్టాలను ప్రదర్శించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa