ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏకాంతంగా తీసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తా

national |  Suryaa Desk  | Published : Sat, Jun 06, 2020, 08:41 AM

పెళ్లి చేసుకుంటానని 26 ఏళ్ల యువతిని ఓ యువకుడు నమ్మించాడు. ప్రేమ, పెళ్లి ముసుగులో ఇంత కాలం ఆయువతిని అన్ని విదాలుగా వాడుకున్నాడు. పెళ్లి చేసుకునే వ్యక్తి కదా అని నమ్మిన ఆ యువతి గుడ్డిగా అతనితో ఏకాంతంగా గడిపింది. ప్రియురాలితో ఏకాతంగా గడిపిన సమయంలో ప్రియుడు రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీశాడు, లాక్ డౌన్ సందర్బంగా వ్యాపారం మూతపడటం, ఆర్థిక సమస్యలు ఎదురుకావడంతో జల్సాల కోసం యువతిని డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఏకాంతంగా తీసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన ప్రియురాలి పర్సనల్ వీడియోలు, ఫోటోలను ఆమె ప్రియుడు సోషల్ మీడియాలో పోస్టు చేసేశాడు.


 


తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా అళగియా పాండిపురానికి చెందిన మార్ఫిన్ గణేష్ (26) అనే యువకుడు సొంతంగా సీడీ షాపు నిర్వహిస్తున్నాడు. సీడీ షాపుకు వచ్చివెళ్లే వారితో మార్ఫిన్ గణేష్ పరిచయాలు పెంచుకునేవాడు. ఈ క్రమంలోనే మంజుల అనే యువతి(26)తో అతడికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించిన గణేష్ తరుచూ బయటకు తీసుకెళ్లి శారీరక వాంఛలు తీర్చుకునేవాడు. ఈ క్రమంలోనే ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా సెల్‌ఫోన్లో వీడియోలు, ఫోటోలు తీసేవాడు. ఇటీవల లాక్‌డౌన్ రావడంతో గణేష్ సీడీల దుకాణం మూతపడింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. అప్పుడే అతడికి దురాలోచన పుట్టింది. మంజులతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు, ఫోటోలు బయటకు తీశాడు.


 


వాటిని ప్రియురాలికి చూపించి అడిగినంత డబ్బు ఇవ్వకపోతే అందరికీ చూపిస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. దీంతో భయపడిన ఆమె అనేకసార్లు అతడికి డబ్బులు ఇచ్చింది. ఇటీవల మరోసారి డబ్బుల కోసం అతడు వేధించగా తన దగ్గర లేదని మంజుల తెగేసి చెప్పింది. దీనికి తోడు తన కూతురి జోలికి రావొద్దని మంజుల తల్లి గణేష్‌ను హెచ్చరించింది. దీంతో కక్షగట్టిన అతడు ప్రియురాలి న్యూడ్ వీడియోలు, ఫోటోలు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మంజుల తల్లి అంజు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గణేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతడు పోస్ట్ చేసిన ఫోటోలను సోషల్‌మీడియా నుంచి డిలీట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa