ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో సోనూ సూద్ భేటీ

national |  Suryaa Desk  | Published : Mon, Jun 08, 2020, 12:37 PM

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో నటుడు సోనూ సూద్ భేటీ అయ్యారు. కరోనా కల్లోల పరిస్థితుల్లో వలస కార్మికులను స్వస్థలాలకు పంపించే విషయంలో సోనూ సేద్ చూపిన చొరవకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతుండగా…శివసేన నాయకుడు సంజయ్ రౌత్ మాత్రం కొత్తా దేముడండీ అంటూ ఎద్దేవా చేసి విమర్శలు గుప్పించారు. ముంబై సెలబ్రిటీ మేనేజర్ అవ్వాలని సోనూసూద్ ప్రయత్నిస్తున్నాడంటూ విమర్శించారు.  లాక్ డౌన్ అమల్లో ఉన్న సమయంలో సోనూ సూద్ అన్ని బస్సులను ఎలా తీసుకువచ్చారని ఆయన నిలదీశారు. ఈ నేపథ్యంలో  సోనూసూద్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోనూసూద్ సీఎంతో భేటీ అయ్యారనీ ఆదిత్య థాక్రే ధృవీకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa