ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అటల్ పెన్షన్ యోజన పథకం కొత్త రూల్స్ ఇవే...

national |  Suryaa Desk  | Published : Mon, Jun 08, 2020, 12:42 PM

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలలో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా ఒకటి. అసంఘటిత రంగంలోని వారికి ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ పథకాన్ని అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా అటల్ పెన్షన్ యోజన స్కీమ్ రూల్స్‌ను మార్చింది. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్‌ఎస్‌డీఎల్) ప్రకారం.. 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉన్న వారు ఈ పథకంలో చేరవచ్చు. ఆదాయపు పన్ను పరిధిలోకి రాని వారు మాత్రమే ఈ స్కీమ్‌లో చేరాలి. నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ పొందొచ్చు.


కొత్త రూల్స్ ఇవే..


1. ఇకపై ఈ స్కీమ్ సబ్‌స్క్రైబర్లకు అప్‌గ్రేడ్, డౌన్‌గ్రేడ్ ఫెసిలిటీ ఉండదు.


2. ఏపీవై సబ్‌స్క్రైబర్లు పీఆర్ఏఎన్ కార్డు పొందొచ్చు. ఇఎన్‌పీఎస్ పోర్టల్ ద్వారా ఈ కార్డు తీసుకోవచ్చు.


3. అటల్ పెన్షన్ యోజన వెబ్‌సైట్‌లో ఏపీవై సబ్‌స్క్రైబర్లు సమాచారం, ఏపీవై ఫామ్ అందుబాటులో ఉంటాయి.


4. ఏపీవై సబ్‌స్క్రైబర్లు www.npscra.nsdl.co.in వెబ్‌సైట్‌కు వెళ్లి ఇపీఆర్ఏఎన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో పీఆర్ఏఎన్ కార్డు ఇమేజ్, వ్యక్తిగత సమాచారం, నామినేషన్ వివరాలు, ఏపీవై అకౌంట్ నెంబర్ వంటివి ఉంటాయి.


5. సబ్‌స్క్రైబర్ మరణిస్తే.. భాగస్వామి స్కీమ్‌లో కొనసాగవచ్చు. ఈ నిర్ణయం భాగస్వామి ఇష్టం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa