శిక్షణ విమానం కూలి ఇద్దరు ట్రైనీ పైలట్లు మరణించారు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. ఒడిశాలోని బిరాసలా వైమానిక కేంద్రం నుంచి సోమవారం ఉదయం సెస్నా ఎఫ్ఏ -152 వీటీ ఈఎన్ఎఫ్ శిక్షణ విమానం బయల్దేరింది. అది దెంకనల్ జిల్లా కంకదహడ సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ల శిక్షకుడు సంజయ్ కుమార్, ట్రైనీ పైలట్ అనీస్ ఫాతిమాలు మరణించారు. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్లే ఈ ప్రమాదం జరిగిందని దెంకనల్ జిల్లా ఎస్పీ అనుపమ జేమ్స్ చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa