ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోరువెచ్చని నీటిలో ఇవి కలిపి తాగితే..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 08, 2020, 02:16 PM

ఏ రోగాలు రాకుండా ఉండాలంటే ఆహారమే అసలైన ఔషధం. సరైన ఆహారం తీసుకుంటే చాలు ఎలాంటి సమస్యలు రావు. శరీరంలో రోగ నిరోధక శక్తి ఉంటే ఎలాంటి సమస్యలు రావు. అందుకే, ముందుగా మనం శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. ప్రస్తుతం కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఏం చేయాలన్నా... ఏం తినాలన్నాఆ భయమే. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


ఆహారమే మహా ఔషధమై మనలో అన్ని సమస్యలనీ దూరం చేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే వాటిలో గోరువెచ్చని నీటి మిశ్రమం ఒకటి. దీనిని ఎలా తయారు చేసుకోవాలంటే.. రోజు ఉదయం ఒకరికి ఓ గ్లాసు చొప్పున నీటిని వేడి చేయండి. అది గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో తేనె, మిరియాల పొడి వేసి తాగండి. చిటికెడు పసుపు కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమంలో కలిపే అన్ని పదార్థాల్లోనూ యాంటీ బయాటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తాగడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీని వల్ల చాలా వరకూ జలుబు, దగ్గు సమస్యలు దరిచేరవు. జ్వరాలు కూడా దూరం అవుతాయి. కరోనా వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఈ గోరు వెచ్చటి నీటి మిశ్రమం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం


గోరువెచ్చని నీటి మిశ్రమం వల్ల కలిగే లాభాలు..


. రోగ నిరోధక శక్తి పెరిగి సమస్యలు దూరం అవుతాయి.


. ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యలు దూరం అవుతాయి. కరోనా వల్ల ఎక్కువగా ఊపిరి, శ్వాస సమస్యలు ఉంటాయి.


. ఈ గోరువెచ్చని నీరు తాగడం వల్ల శ్లేష్మం తగ్గుతుంది. ముఖ్య విషయం ఏంటేంటే.. వాడే తేనె ఎక్కువ రోజులు నిల్వ ఉండేది అయితే మంచిది.


. శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది.


. మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి.


. ఆయాసం, దగ్గు, కఫంతో బాధపడేవారు అరంచెంచా తేనెను వేడి నీటిలో వేసుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది.


. గోరు వెచ్చని నీటిలో రెండు చెంచాల తేనె, 1 చెంచా వేయించిన వాము వేసి తాగండి. ఇలా తాగితే అజీర్ణం, కడుపునొప్పి తాగుతాయి.


. గోరు వెచ్చని నీటిలో అరచెంచా తేనె వేసుకుని పుక్కిలించండి. గొంతునొప్పి, చిగుళ్ళ వాపు తగ్గుతుంది.


. కాఫీ, టీలకు బదులు గ్రీన్‌ టీలో కొద్దిగా తేనె వేసుకుని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల మరో లాభం ఏంటంటే.. కొలెస్ట్రాల్ తగ్గి లావు కూడా తగ్గుతారు.


కరోనా, జ్వరం, జలుబు, దగ్గు, వైరస్‌లు ఇలా ఏ సమస్యలైనా సరే.. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటేనే మనపై దాడి చేస్తాయి. . అందుకే మనలో ఆ సమస్య లేకుండా ముందుగా జాగ్రత్త పడాలి. అందుకోసం సరైన ఆహారం తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడం ఆహారం తాజాగా వండుకుని ఆ ఆహారాన్నే తీసుకోవడం చేయాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa