ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇసుక పాలసీలో అక్రమాలు జరుగుతున్నాయి : కాంగ్రెస్ నేత నారాయణరావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 08, 2020, 02:30 PM

ఏపీలో కొత్త ఇసుక పాలసీని తీసుకురావాలని కాంగ్రెస్ నేత నారాయణరావు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకపై తీసుకొచ్చిన నూతన విధానంవల్ల నిర్మాణ రంగం తీవ్ర ఇబ్బందులు పడుతోందన్నారు. ఇసుక పాలసీవల్ల పడుతున్నఇబ్బందులను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నా.. పట్టించుకోకపోవడం  చాలా బాధాకరమని అన్నారు. 


చివరికి సొంతపార్టీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, జగ్గిరెడ్డి, ఎంపీ రఘురామకృష్ణంరాజు లాంటివాళ్లు మాట్లాడుతూ.. ఒక లారీ ఇసుక తెప్పించుకోలేకపోతున్నామని, ఇందులో అక్రమాలు జరుగుతున్నాయని, ఈ విధానమే బాగోలేదని వాళ్లు విమర్శలు చేశారన్నారు. అధికారపక్షం నేతలే ఇలా మాట్లాడుతుంటే.. రాష్ట్రంలో ఇసుక పరిస్థితి ఎలా ఉందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ఆయన అన్నారు. నిర్మాణ రంగంపై ఆధారపడిన లక్షలాదిమంది కార్మికులు రోడ్డునపడ్డారన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ మేల్కొని ఇసుక పాలసీని మార్చాలని నారాయణరావు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa