ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీకి షాక్.. వైసిపిలోకి మాజీ మంత్రి!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 09, 2020, 03:23 PM

టిడిపికి చెందిన మరో మాజీమంత్రి కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో టీడీపీకి కొద్దో గొప్పో చెప్పుకోదగ్గ ఫలితాలు వచ్చిన ప్రకాశం జిల్లాకు చెందిన ఆ పార్టీ ముఖ్య నేత, మాజీమంత్రి శిద్ధా రాఘవరావు రేపు వైసీపీలో చేరనున్నట్టు గుసగుసలు వినపడుతున్నాయి. కుమారుడితో కలిసి ఆయన సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని రాజకీయవర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత కరణం బలరాం సీఎం జగన్‌కు జై కొట్టారు. మాజీమంత్రి శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరనుండటం టీడీపీకి పెద్ద దెబ్బగా మారనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa