ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ ఏడాది పాలనపైన టీడీపీ నేతల విమర్శలు...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 09, 2020, 03:18 PM

వైసీపీ ఏడాది పాలనపైన మాజీ మంత్రి అమరనాథ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షులు పులివర్తి నాని, ఎమ్మెల్సీ దొరబాబు విమర్శలు గుప్పించారు. నేడు వారు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఏడాది పాలనలో అభివృద్ధి ఎక్కడ కనిపించలేదన్నారు. దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు విధ్వంసాల పాలన సాగిందన్నారు. సంక్షేమానికి పెద్ద పీట వేస్తామన్న ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.


అమరావతి రాజధాని నిర్మాణం అంశానికి సంబంధించి ఇంతవరకు వారు స్పష్టం చేయడం లేదన్నారు. ప్రత్యేక హోదా అంశంపైన స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రత్యేక హోదా విషయం గాలికి వదిలి పెట్టారని విమర్శించారు. అన్ని కేసుల విషయంలోనూ కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని.. ఇలా చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. మాట తప్పం.. మడమ తిప్పం అన్న జగన్‌కు నిజాయితీ ఉంటే వెంటనే రాజీనామా చేసి బయటకు రావాలని టీడీపీ నేతలు సవాల్ విసిరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa