లాక్ డౌన్ తర్వాత ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. వాహనాల అతివేగం ఎక్కువవడంతో రోడ్డు ప్రమాదాలలో చాలా మంది మరణిస్తున్నారు. తాజాగా ఇరుకు వీధిలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు రోడ్డుపై నడిచి వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌కు చెందిన విజేందర్ వీధిలో నడుచుకుని వెళ్తుండగా ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. పక్కకి తప్పకున్నా కూడా ఆ కారు అతడిని బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి వ్యక్తి గాల్లోకి ఎగిరిపడ్డాడు. ప్రమాదం చేసినా కూడా ఆ కారు వాళ్లు ఆపకుండా వెళ్లిపోయారు. దీంతో పోలీసులు కారు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో నిందితుల కోసం గాలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa