ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వర్షాలు ప్రారంభమయ్యే నాటికి 70 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక : జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 09, 2020, 04:09 PM

12 నాటికి లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో డిస్‌ప్లే చేయాలని సీఎం జగన్ అన్నారు. నిర్ణీత సమయంలోగా గ్రామ, వార్డు సచివాలయాల సేవలు అందకపోతే పరిహారం ఇవ్వాలన్నారు. వర్షాలు ప్రారంభమయ్యే నాటికి 70 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వ చేయాలన్నారు.  ఇవాళ స్పందనపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. శ్రీకాకుళం, గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఇసుక ఉత్పత్తిని పెంచాలని చెప్పారు. ఎల్లుండి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్‌ విధానం అమలు చేయాలన్నారు. ఇసుక అక్రమాల్లో ఎవరున్నా ఉపేక్షించవద్దు..సీఎం మీతో ఉన్నాడు, దూకుడుగానే ఉండండలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa