ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళనాడులోనూ టెన్త్ పరీక్షలు రద్దు: సీఎం పళనిస్వామి

national |  Suryaa Desk  | Published : Wed, Jun 10, 2020, 08:53 AM

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. విద్యార్థులందరినీ పై తరగతులకు ప్రవెూట్‌ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో ఆ రాష్ట్రంలో చదువుతున్న 9 లక్షల మంది విద్యార్థులకు పరీక్షల నుంచి ఉపశమనం లభించినట్లయింది. అలాగే క్లాస్‌ 11 తరగతుల పరీక్షలు కూడా రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పదో తరగతి తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రవెూట్‌ చేస్తున్నామని తెలిపారు. క్వార్టర్లీ, హాఫ్‌ ఇయర్లీ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 80శాతం మార్కులు, హాజరు ఆధారంగా 20శాతం మార్కులు లెక్కగడతామని ముఖ్యమంత్రి వెల్లడించారు. తొలుత జూన్‌ 15 నుంచి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేసింది. అయితే కొవిడ్‌ విజృంభణను దృష్టిలో పెట్టుకుని పరీక్షల నిర్వహణ వాయిదాను పరిశీలించాలని మద్రాస్‌ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ నిపుణులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఇప్పట్లో వైరస్‌ తగ్గుముఖం పట్టే అవకాశాలు లేవని వారు స్పష్టం చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa