ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిమ్మగడ్డ కేసులో స్టేకు నిరాకరించిన సుప్రీం..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 10, 2020, 02:00 PM

ఏపీ ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్ కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. నిమ్మగడ్డ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. రాజ్యాంగ పదవులతో ఆటలాడుకోవద్దు అని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం... ఆర్డినెన్స్ తీసుకురావడంలో ప్రభుత్వానికి మంచి ఉద్దేశాలు, ఆలోచనలు ఉన్నాయని ధర్మాసనం సంతృప్తి చెందడం లేదని పేర్కొంది. ఇదే సమయంలో ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు... రెండు వారాలలో సమాధానం చెప్పాలని ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa