బీహార్‌లోని పాట్నాకు చెందిన అక్తర్ ఇమామ్ తనకు 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి మోతీ, రాణి అనే ఏనుగులను పెంచుతున్నాడు. ఏసియన్ ఎలిఫాంట్ రిహాబిలిటేషన్ అండ్ వైల్డ్ యానిమల్ ట్రస్ట్ (ఏఈఆర్ఏడబ్ల్యుఏటీ) ట్రస్టుగా ఉన్న ఆయన ఆ రెండు ఏనుగులను వదిలి క్షణం ఉండలేకపోయేవాడు. వాటిపై ఉన్న ప్రేమతో ఆయన ఏనుగుల పేరు మీద ఏకంగా రూ.5 కోట్ల ఆస్తిని రాసిచ్చాడు. అవి తన ప్రాణాలను కాపాడిన ఏనుగులని ఇమామ్ తెలిపాడు. ఓ రోజు గుర్తు తెలియని వ్యక్తులు తనను హత్య చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలోఈ ఏనుగులే రక్షించాయి. దుండగులు పిస్తోల్‌తో ఇంట్లోకి ప్రవేశిస్తున్న సమయంలో ఏనుగులు గట్టిగా అరుస్తూ నిద్రలేపాయి. ఆ దుండగలను చూడగానే గట్టిగా కేకలు పెట్టడంతో వాళ్లు పారిపోయారు. తన ప్రాణాలను కాపాడిన ఆ ఏనుగుల రుణం తీర్చుకోడానికి ఇంతకంటే గొప్పగా తాను ఏమీ చేయలేనని, అందుకే తన ఆస్తులను ఆ ఏనుగులకు రాసిచ్చేసినట్లు తెలిపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa