రాశి- మేషం:శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. వివాహయత్నాలకు కొంత అనుకూల కాలంగా ఉంటుంది. పిల్లల భవిష్యత్తుపై శ్రద్థ అవసరం.
రాశి-వృషభం: స్వల్ప అస్వస్థతకు గురవుతారు. భావోద్వేగాలకు దూరంగా ఉండడం మంచిది. గృహనిర్మాణ ఆలోచనలు స్థిరంగా ఉండవు. సోదరుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా పూర్తిచేస్తారు. బ్యాంకు పనుల్లో చికాకులు అధికం.
రాశి- మిధునం: పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. పనులలో విజయం సాధిస్తారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాల్లో జీవితభాగస్వామి సలహాలు తీసుకుంటారు. ఉద్యోగయత్నాలు కలిసొస్తాయి.
రాశి- కర్కాటకం: ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. బంధువులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విందువినోదాలలో పాల్గొంటారు.
రాశి- సింహం :అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు.
రాశి- కన్య :పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. దీర్ఘకాలిక సమస్యలు చికాకు కలిగిస్తాయి. కుటుంబసభ్యుల సహాయసహకారాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి.
రాశి-తుల :పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. పనులను సకాలంలో పూర్తిచేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
రాశి- వృశ్చికం :పిల్లల విషయంలో శుభ పరిణామాలున్నాయి. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. బంధువులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. విందువినోదాలలో పాల్గొంటారు. పనులు చకచకా పూర్తిచేస్తారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
రాశి- ధనస్సు: చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. దీర్ఘకాలిక ఋణాలు కొంతవరకు తీరుస్తారు. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తిచేస్తారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి.
రాశి- మకరం: కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. కుటుంబసభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. అనుభవజ్ఞుల సలహా పాటించండి.
రాశి- కుంభం :కొత్త సమస్యలు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. విఘ్నేశ్వరునికి దీపారాధన చేయండం మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలు చేపడతారు.
రాశి- మీనం :అప్రమత్తంగా ఉండాలి. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం కష్టమే. ఉద్యోగాలలో స్థానచలనం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆత్మీయులకు సాయం అందిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa