క్రోధంగా అనిపించడం, సరిగ్గా పనిచేయకపోవడం వంటివి నిద్ర లేకపోవడం యొక్క ప్రభావాలు. నిద్ర లేమి మీ శారీరక ఆరోగ్యంపై కూడా తీవ్ర పరిణామాలను కలిగిస్తుంది. ప్రతీ ముగ్గురిలో ఒకరు నిద్రలేమితో బాధపడుతున్నారు. ఒత్తిడి, కంప్యూటర్లు లాంటివి ప్రధాన కారణాలు. నిద్రలేమి ఊబకాయం, గుండె జబ్బులు , మధుమేహం లాంటి వాటిని తీసుకొస్తుంది. మీ ఆయుర్ధాయాన్ని తగ్గిస్తుంది. రాత్రి సమయంలో తగినంత నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. మనలో చాలా మందికి చురుగ్గా ఉండడానికి, సరిగ్గా పనిచేయడానికి నిద్ర అవసరం. కానీ కొంతమందికి ఎక్కువ, కొంతమందికి తక్కువ అవసరం. నిద్రలేమి వలన ప్రతిఒక్కరూ అలసట, స్వల్ప కోపం, సరిగా దృష్టి లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. సరిగా నిద్రలేని తర్వాతి రోజు మీకు అలసటగా, చికాకుగా ఉంటుంది. అప్పుడు మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య ఉండదు. క్రమంగా ఇలాగె జరుగుతుంటే మీరు జాగ్రత్తపడాలి. లేకపోతే మానసికంగా ప్రభావం చూపుతుంది. మీ మెదడు చురుగ్గా ఉండదు. ఏకాగ్రత కుదరకపోవడం, నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యాన్ని కోల్పోవడం జరుగుతుంది. దీంతో మీరు పగలు నిద్రపోతారు. మీరు గాయాలు, ప్రమాదాలపాలయ్యే అవకాశం పెరుగుతుంది. ఇదే కొనసాగితే మీరు శారీరకంగా, మానసికంగా తీవ్ర సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
తగినంత నిద్ర వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి..
-> తగినంత నిద్ర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
-> మీరు యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
-> మానసికంగా ధృడంగా ఉండేలా చేస్తుంది.
-> మధుమేహాన్ని నివారించడానికి మనిషికి తగినంత నిద్ర అవసరం.
-> శృంగార సామర్ధ్యాన్ని పెంచుతుంది.
-> గుండెజబ్బుల ప్రభావాన్ని తగ్గిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa