చిత్తూరు జిల్లా : చిత్తూరు జిల్లా మదనపల్లి చేరుకున్న ఏపి ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి.. నారాయణ స్వామి.ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మీడియా తో మాట్లాడుతూ ...మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ లో సమీక్ష.పాల్గొన్న చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, శాసనసభ్యులు ఎం నవాబ్ బాషా, ద్వారక నాధ్ రెడ్డి, కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, జిల్లా జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మ o,ఇతర అధికారులు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మదనపల్లి రూరల్ మండలం సాని టోరియం, వెంకటప్ప కోట, రాచవేటి వారి పల్లి గ్రామాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు స్థలం పరిశీలన.మదనపల్లి చాలా వెనుక పడ్డ ప్రాంతం.. పేదలకు అత్యవసర వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్ళవ ల సి న పరిస్థితి....
మారు మూల ప్రాంతంలో నిరు పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి సంకల్పం.మదనపల్లి లో వైద్య కాలేజీ ఏర్పాటు అవసరం ఉంది.ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు వల్ల చిత్తూరు, కడప జిల్లాలలోని మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు, పుంగనూరు, రాయచోటి, కదిరి నియోజకవర్గాలకు ఎంతో ఉపయోగం.ఈ ప్రాంతంలో సరైన వైద్యం అందక పోవడం వల్ల ప్రజలు వందల కిలోమీటర్లు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది.ఈ ప్రాంతంలో పేద ప్రజలు ఇబ్బందులు గుర్తించి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయం.రానున్న మూడు సంవత్సరాలలో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి దృడ సంకల్పం....
ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల నిర్మాణానికి ఆగష్టు లో టెండర్లు పిలుస్తాం.రాష్ట్రము లో అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ అభివృద్ధికి 16వేల కోట్లు రూపాయలు ఖర్చు చేయనున్నాం.అన్ని గ్రామ, వార్డ్ సచివాలయాల సమీపంలో త్వరలో విలెజ్ క్లినిక్ లు ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa