ప్రపంచంలో మనల్ని ఆశ్చర్యానికి గురిచేసే విషయాలు ఎన్నో ఉన్నాయి. సాధారణంగా నేటి ఉరుకులు పరుగుల జీవితంలో మనిషి 100 సంవత్సరాలు బ్రతికితే అదే ఒక వింత. కానీ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఒక వ్యక్తి ఏకంగా 256 సంవత్సరాలు బ్రతికాడని చెబుతున్నారు. మరి ఇంతకీ ఇన్ని సంవత్సరాలు బ్రతికిన ఆయన ఎవరు? ఆయన ఎక్కడ జన్మించాడు? ఆయన గురించి వివరాలు తెలుసుకుందాం...చైనాలో జన్మించిన లి చింగ్ యుయెన్ అనే వ్యక్తి 256 సంవత్సరాలు బ్రతికినట్లు చెంగ్డూ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్న వు చుంగ్ చై తెలిపినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ఈయన 1827సం.లో 150 పుట్టినరోజు, 1877 సం.లో 200 పుట్టినరోజు జరుపుకున్నట్లు చైనీస్ గవర్నమెంట్ రికార్డులో నమోదైనట్లు తెలిపింది. అయితే ఇదే విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ 1928లో ఆధారాలతో సహా వెలుగులో తెచ్చింది. ఈ కథనాన్ని 1930లో ప్రచురించింది.
లీ చింగ్ యుయెన్ 10 సంవత్సరాల వయస్సు నుంచి ఎక్కువ కాలం జీవించే గుణాలు కలిగిన లింజై, గోజీ బెర్రీ, జిన్సెంగ్, గోటుకోలా వంటి ఔషధాలను 40సంవత్సరాల దాకా ఆహారంగా తీసుకున్నాడు. అయితే యుద్ద విన్యాసాల్లో ఆరితేరిన లీను 1749 సం.లో అంటే 71 ఏళ్ళ వయస్సులో చైనా సైన్యానికి యుద్ధ విన్యాసాలను నేర్పే గురువుగా తీసుకున్నారు. చింగ్‌కు 24 మంది భార్యలు, 200 మంది పిల్లలు ఉన్నారు. అతను మొత్తము 11 తరాలను చూశాడని ఆ ప్రొఫెసర్ వెల్లడించారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.ఆయన ఎప్పుడూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, వ్యాయామంతో శ్వాసకు సంబంధించిన పద్దతులు అవలంభించడం, తనకిష్టమైన తాబేలు పిల్లలా పరుగులు తీయడం, పక్షుల్లాగా నిద్రపోవడం, ఇలా తను పాటించిన ఆహారపు అలవాట్ల వల్లే ఇన్ని సంవత్సరాలు బ్రతికాడని తెలిపినట్లు ఆ కథనం వెలువరించింది.పోస్టల్ శాఖలో 4166 ఉద్యోగాలు..టెన్త్ పాసైతే చాలు: getlokalapp.com/share/posts/1189089
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa