ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో 17 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 13, 2020, 01:08 PM

ఏపీ ప్రభుత్వం భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. రాష్ట్రంలో 17 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. రైల్వే డీజీపీగా ద్వారకా తిరుమలరావుని నియమించింది. విజయవాడ సిటీ పోలీసు కమిషనర్‌గా బి.శ్రీనివాసులు, ఏడీజీపీ ఆర్గనైజేషన్‌గా ఎన్‌.బాలసుబ్రమణ్యంను బదిలీ చేసింది. రోడ్‌ సేఫ్టీ ఏడీజీపీగా కృపానంద్‌ త్రిపాఠి ఉజాలా, ఎస్‌ఈబీ డైరెక్టర్‌గా పి.హెచ్‌.డి.రామకృష్ణ, గుంటూరు అర్బన్‌ ఎస్పీగా ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి, శ్రీకాకుళం ఎస్పీగా అమిత్‌ బర్దార్‌ని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.


వీరితో పాటు డీజీపీ ఆఫీస్‌ అడ్మిన్‌ ఏఐజీగా బి.ఉదయ్‌ భాస్కర్‌, విశాఖ శాంతిభద్రతల డీసీపీగా ఐశ్వర్య రాస్తోగి, డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాల్సిందిగా ఎస్‌.రంగారెడ్డికి ఆదేశాలు జారీచేసింది. ఎస్‌ఐబీ ఎస్పీగా అట్టాడా బాబూజీ, విశాఖ గ్రామీణ ఎస్పీగా బి.కృష్ణారావు, విజయవాడ రైల్వే ఎస్పీగా సి.హెచ్‌.విజయరావు, ప.గో. జిల్లా ఎస్పీగా నారాయణనాయక్‌ ని నియమించింది.


సీఐడీ ఎస్పీగా నవదీప్‌సింగ్‌ గ్రేవాల్‌, గుంటూరు గ్రామీణ ఎస్పీగా విశాల్‌ గున్నీ, ఎం.దీపికకు డీజీపీ కార్యాలయంలో ఏపీఎస్‌పీ 6వ బెటాలియన్‌ కమాండెంట్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్సగించింది. దిశ ఘటన ప్రత్యేక అధికారిగా ఉన్న దీపికకు ఆరవ పటాలం కమాండెంట్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa