ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళనాడు తరహా కక్ష సాధింపులను తీసుకొచ్చారు: సోమిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 13, 2020, 01:54 PM

తమ పార్టీ నేత  జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని అరెస్ట్‌ చేయడం సరికాదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేయడం దుర్మార్గమని, పసిబిడ్డ అస్మిత్ రెడ్డినీ అరెస్ట్ చేయడం మరీ అన్యాయమని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలలో రాజకీయ పోరాటాలు ఉండేవని, వ్యక్తులు, వ్యాపారాలను లక్ష్యంగా చేసుకోలేదని ఆయన చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో తమిళనాడు తరహా కక్ష సాధింపులను తీసుకురావడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa