ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుశాంత్ సింగ్ కి విరాట్ కోహ్లీ సంతాపం..

national |  Suryaa Desk  | Published : Sun, Jun 14, 2020, 06:26 PM

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆకస్మిక మరణం అందరినీ కలిచివేస్తుంది. ముంబైలో గత కొద్ది నెలలుగా ఒంటరిగా ఉంటున్న సుశాంత్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అందుకు కారణం గత కొద్ది రోజులుగా అతను అనుభవిస్తున్న డిప్రెషనే అని కొందరు అంటున్నారు. 16 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు 2002లో తల్లి చనిపోయింది.  బాలివుడ్‌ ప్రముఖులతో పాటు క్రికెటర్లు కూడా సోషల్‌మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 'సుశాంత్‌ సింగ్‌ మరణవార్త కలచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి శక్తినివ్వాలని దేవుడిని కోరుకుంటున్న్ణ అని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ట్వీట్‌ చేశాడు. 'ప్రతిభ కలిగిన యువ నటుడి మరణం కలచివేసింద'ని సచిన్‌ టెండూల్కర్‌ ట్వీట్‌ చేయగా.. 'ఇది బాధ కలిగించే వార్త.. నిజంగా చాలా కలతగా ఉంది. తెలివైన నటుడు సుశాంత్‌' అని టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ ట్వీట్‌ చేశాడు. 'ఇది ఫేక్‌ న్యూస్‌ అని ఎవరైనా నాకు చెప్పండి.. అతడి మరణాన్ని నేను నమ్మలేక పోతున్నా' అని స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ తన బాధను సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa