వాహనాల రిజిస్ట్రేషన్ లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టైన దివాకర్ ట్రావెల్స్ యజమాని, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డికి ఈ రోజు కరోనా పరీక్షలు నిర్వహించారు. కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉంటున్న వీరికి వైద్య సిబ్బంది స్వాబ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా కడప సెంట్రల్ జైలులో ఖైదీలకు ములాఖత్ నిలిపివేశారు. అయితే ఈరోజు జేసీ కుటుంబాన్ని పరామర్శించడానికి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతపురం జిల్లా తాడిపత్రికి రానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa