తమిళనాడులో ఓ యువకుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. తాను ప్రేమించిన అమ్మాయితో కలిసి ఉండగా చూశాడని ఓ చిన్నారిని హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తిరుప్పూరు జిల్లా ఊత్తుకుల్లి సమీపంలోని సొట్టక వుండమ్ ప్రాంతానికి చెందిన తంగరాజ్,సుమతి దంపతులకు కవల పిల్లలు విఘ్నేష్,భువనేష్. తంగరాజ్,సుమతి బనియన్ కంపెనీలో పని చేస్తున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతి తన కాలేజ్ ఫ్రెండ్ అయిన యువకునితో కలిసి ఉండడాన్ని భువనేష్ చూశాడు. ఈ విషయం బయటికి పొక్కుతుందని వారు భయపడ్డారు. భువనేష్ ని ఆ యువకుడు కత్తితో పొడిచి చంపి పొదల్లో పడేశారు. ఈ ఘటన శనివారం జరిగినట్టు సమాచారం. పనికి వెళ్లి వచ్చిన తల్లిదండ్రులకు కొడుకు కనపడకపోవడంతో అంతా వెతకగా చివరికి విగతజీవిగా అతను కనిపించాడు. ఈ ఘటన పై ఊత్తుకులి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa