రాశి-మేషం: వ్యాపకాలు సృష్టించుకుంటారు. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ప్రారంభించిన పనులను సులువుగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు.
రాశి-వృషభం :పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అవసరానికి తగిన సహకారం అందుతుంది. మీ సొంత విషయాలపై ఇతర ప్రభావం లేకుండా చూసుకోవాలి. వ్యాపకాలు సృష్టించుకుంటారు.
రాశి- మిధునం: నమ్మకస్తులే తప్పు దారి పట్టించే ఆస్కారం ఉంది. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
రాశి- కర్కాటకం: మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలు ఎదురవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సహాయ సహకారాలుంటాయి. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కీలక విషయాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
రాశి- సింహం:ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. మీ ప్రతిభకు పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాల్లో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రసంశలను అందుకుంటారు.
రాశి- కన్య: సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రయత్నకార్యసిద్ధి ఉంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.
రాశి- తుల: మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలు ఎదురవుతాయి. చక్కటి ఆలోచనా విధానంతో సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీకు లాభిస్తాయి. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరమునకు సహాయం చేసేవారున్నారు.
రాశి-వృశ్చికం: ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. సమాజంలో గొప్ప వ్యక్తిత్తాన్ని కలిగి ఉంటారు. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. స్ధాన చలన సూచనలు ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి.
రాశి-ధనస్సు :అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఉన్నత పదవీ లాభాలున్నాయి. నూతన వస్తువులు కొంటారు. స్ధిర నిర్ణయాలతో శుభం చేకూరుతుంది. వ్యాపారంలో తోటి వారి సలహాలు మేలు చేస్తాయి. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
రాశి-మకరం: ఊహించని విధంగా లభించిన ఖాళి సమయంలో భవిషత్ ఆలోచనలు చేస్తారు. చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు తప్పవు. అధికారులను మెప్పించడానికి శ్రమ అధికమవుతుంది. ఒక వ్యవహారములో అపకీర్తి వచ్చే ఆస్కారముంది. ఉత్సాహంతో ముందుకు సాగండి. అంతా మంచే జరుగుతుంది.
రాశి-కుంభం: నిరుద్యోగులు మరింత కృషి చేయాలి. మీరు పనిచేసే రంగంలో మీ శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి.
రాశి-మీనం: వైద్య, పోలీస్, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆత్మీయుల సహకారంతో పనులను చక్కబెడతారు. ఒక వ్యవహారములో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కొన్ని సమయాలలో ఒక నిర్ణయానికి కట్టుబడక నిర్ణయాలు తరచూ మారుస్తుంటారు. కలహాలు సూచితం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa